గుంజీల వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది

గుంజీల వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది

స్కూల్‌‌ డేస్‌‌లో తెలుగు పద్యం చెప్పకపోయినా, లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చినా టీచర్లు మనతో గుంజీలు తీయించిన జ్ఞాపకాలు అందరికీ గుర్తుండి ఉంటాయి. గుంజీలు తీయిస్తే  స్టూడెంట్స్ ఏ తప్పూ చేయరని, ఇలాంటి పనిష్మెంట్‌‌లు ఇస్తుంటారు టీచర్లు. అయితే, దీన్నే ఇప్పుడు విదేశాల్లో ‘సూపర్‌‌‌‌ బ్రెయిన్ యోగా’ అంటున్నారు. పేషెంట్ల జబ్బు నయం చేయడానికి వాళ్లతో గుంజీలు తీయిస్తున్నారు డాక్టర్లు. 

గుంజీలు తీయడం వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడి తెలివి తేటలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. అందుకే అమెరికాలోని చాలామంది డాక్టర్లు, ఫిజియోథెరపిస్ట్‌‌లు పేషెంట్లతో గుంజీలు తీయిస్తున్నారు. డాక్టర్లు పేషెంట్లతో గుంజీలు తీయిస్తున్న వీడియో ఇప్పుడు ట్విట్టర్‌‌‌‌లో వైరల్ అవుతోంది. దీన్ని బెంగళూరుకు చెందిన బిజినెస్‌‌మాన్  పరీక్‌‌ జైన్‌‌ తన ట్విట్టర్ అకౌంట్‌‌లో పోస్ట్‌‌ చేశాడు. ఇప్పటికే 4 లక్షల వ్యూస్‌‌, 13,000 లైక్స్ వచ్చాయి. వీడియో కింద ‘నా చిన్నప్పుడు ఈ పనిష్మెంట్‌‌ తీసుకున్నా. అందుకే నేను ఇప్పుడు మంచి పొజిషన్‌‌లో ఉన్నా’, ‘బహుశా వీటివల్లే నా పరీక్షలన్నీ పాసయ్యానేమో’ అని కామెంట్లు పెడుతున్నారు చాలామంది.